దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ తీవ్ర మ‌వుతోంది. జహంగీర్‌పూరిలోని ఒక కుటుంబంలోని 26 మంది సభ్యులు కరోనావైరస్ బారిన‌ప‌డ్డారు. దీంతో అధికారులు ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఈ ఏరియాను కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించి, వైర‌స్ వ్యాప్తి నిరోధానికి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లుత తీసుకుంటున్నారు. ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు 1767 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మొత్తం 42మంది మ‌ర‌ణించారు. ఆస్ప‌త్రుల‌లో 911 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 27మంది ఐసీయూలో, ఆరుగురు వెంటిలేట‌ర్ల‌పై ఉన్నారు.

 

రోజురోజుకూ ప‌రిస్థితి దారుణంగా మారుతుండ‌డంతో ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌పై ప్ర‌త్యేక దృష్టిపెడుతున్నారు. ఢిల్లీలో మొత్తం 71 కంటైన్మెంట్ జోన్ల‌ను గుర్తించారు. అయితే.. ప్ర‌జ‌లు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించడం లేద‌ని, ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన విష‌య‌మ‌ని సీఎం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు స్వీయ‌నియంత్ర‌ణ‌, సామాజిక దూరం పాటించాల‌ని కోరారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: