క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ కార‌ణంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో దాదాపుగా పరిపాల‌నా క‌ర్య‌క‌లాపాల‌న్నీ ఆగిపోయాయి. తాజాగా.. తిరిగి ప‌రిపాల‌నా కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. రేపటి నుంచి టీటీడీ పరిపాలనా వ్యవహారాలు ప్రారంభం అవుతాయ‌ని. ... కిందిస్థాయి సిబ్బంది 33 శాతం హాజరుకావాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండ‌గా.. లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగించ‌డంతో తిరుప‌తి ద‌ర్శ‌నాన్ని కూడా ఆ తేదీ వ‌ర‌కు నిలిపివేసిన విష‌యం తెలిసిందే. ఇదే స‌మ‌యంలో లాక్‌డౌన్ కార‌ణంగా ఏర్ప‌డిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లను ఆదుకునేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కూడా అనేక చ‌ర్య‌లు తీసుకుంటోంది.

 

ఇందులో భాగంగా నిరాశ్రయులైన ప్రజలకు, పేదలు, రోజువారీ కూలీ కార్మికులకు ఆహార ప్యాకెట్ల పంపిణీ కోసం రూ .13 కోట్లు కేటాయించిన విష‌యం తెలిసిందే. మార్చి 28 నుంచి తిరుపతిలో చిక్కుకున్న యాత్రికులు, వలస కార్మికులకు ఇప్పటివరకు 25 లక్షల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది. టీటీడీ ప్రతిరోజూ 70,000 ఆహార ప్యాకెట్లను అందిస్తోంది. ఎంప్లాయీస్ క్యాంటీన్ కాంప్లెక్స్ ఇప్పుడు రెడ్ జోన్ పరిధిలోకి రావడంతో, శ్రీనివాసం రెస్ట్ హౌస్, తిరుచనూరు, అన్నప్రసాదం కాంప్లెక్స్ మరియు శ్రీ పద్మావతి మహిళా కళాశాలల వంటశాలలలో ఆహార ప్యాకెట్లను తయారు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: