భార‌త్‌లో తాజాగా క‌రోనా పాజిటివ్ కేసులు 16,365కి చేరుకున్నాయి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం మరణాల సంఖ్య 521కు చేరుకుంది. 2వేల మంది క‌రోనా బారి నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి కోలుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రాష్ట్రంలో 3,648 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అందులో దేశ వాణిజ్య‌రాజ‌ధాని ముంబైలో వైర‌స్‌ప్ర‌భావం తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా న‌మోదైన కేసుల‌లో సుమారు 2500కుపైగా ముంబైలోనే న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌ప‌రిణామాలు ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తున్నారు.

 

ముంబైలోని భార‌త నావికా ద‌ళ సిబ్బంది 26 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఢి్ల్లీ, త‌మిళ‌నాడు, రాజ‌స్తాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించిన విష‌యం తెలిసిందే. ఇక ప్ర‌పంచంలో 193 దేశాల‌కు కొవిడ్‌-19 వ్యాపించింది. 2,330,883 కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి . ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి మృతి చెందిన వారి సంఖ్య 160755 చేరుకుంది. ఇక అమెరికాలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం కొన‌సాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: