క‌రోనా ప్ర‌భావంతో దేశ‌వ్యాప్తంగా అన్ని వ్య‌వ‌స్థ‌ల‌కు బ్రేక్ ప‌డింది. ఇక మ‌న‌దేశంలోకి క‌రోనా విదేశాల నుంచి వ‌చ్చిన వారిద్వారానే ఈ రేంజ్‌లో వ్యాప్తి చెందింది అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే మ‌న దేశం ముందుగా మేల్కొని విదేశాల నుంచి వ‌చ్చే అన్ని విమాన సర్వీసుల‌ను ర‌ద్దు చేసింది. ఇక ఇటు రైల్వేల‌ను కూడా పూర్తిగా ర‌ద్దు చేసింది. ఈ నెల 14న లాక్‌డౌన్ ముగిసింది అనుకుంటోన్న నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేయ‌డంతో మ‌ళ్లీ రైల్ బుకింగ్‌లు, విమానాల బుకింగ్‌లు క్యాన్సిల్ అయ్యాయి.

 

అయితే ఇప్పుడు రైల్‌, విమానాల బుకింగ్‌ల కోసం వెయిట్ చేస్తోన్న కోట్లాది మంది భార‌తీయుల‌కు ఎట్ట‌కేల‌కు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. దేశీయంగా ఎంపిక చేసిన రూట్లలో విమాన సర్వీసులు నడుపడానికి మే 4 నుంచి బుకింగ్స్‌ను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా శనివారం తెలిపింది. అలాగే అంతర్జాతీయంగా విమాన సర్వీసులకు జూన్‌ 1 నుంచి బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: