నాలుగు రోజుల కింద మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి వచ్చిన 2 నెలల శిశువుకి కరోనా వైరస్‌ పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ శిశువుకు   వైద్య సేవ‌లు  అందించిన వైద్య సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో నిలోఫర్ ఆసుపత్రిలో పని చేసిన అన్ని వి భాగాల సిబ్బందిని క్వారంటైన్‌‌కి వెళ్లాలని ఆదివారం ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. 

 

మొత్తం 200 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వీరిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు సహా ఇతర సిబ్బంది ఉన్నారు. నారాయణపేట్‌ జిల్లా అభంగాపూర్‌కు చెందిన ఓ మహిళ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించింది. డిశ్చార్జి అయ్యాక రెండు నెలల వయసున్న చిన్నారి అస్వస్థత గురవడంతో నిలోఫర్‌కు తరలించారు. పరీక్షల్లో చిన్నారికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ చిన్నారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబంలోని ఆరుగురిని క్వారంటైన్‌కు పంపించారు. ఆ చిన్నారికి కరోనా ఎలా సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: