ర‌ష్యా.. చైనా ప‌క్క‌నే ఉంటుంది... చైనాలో క‌రోనా విజృంభిస్తున్నా.. ర‌ష్యాలో మాత్రం పెద్ద‌గా క‌రోనా వైర‌స్ పెద్ద‌గా ప్ర‌భావం క‌నిపించ‌లేదు. కానీ.. ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారిపోయింది. చూస్తుండ‌గానే..క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పెరిగిపోయింది. రోజుకు వేల సంఖ్య‌లో పాజిటివ్ కేసుల సంఖ్య న‌మోదు అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో 42,853 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 361మంది మ‌ర‌ణించారు. సుమారు 3,291మంది కోలుకున్నారు. రెండు మూడు రోజ‌లుగా క‌రోనా పాజిటివ్ కేసులు సుమారు ఐదువేల స‌గ‌టుతో న‌మోదు అవుతుండ‌డంతో ప్ర‌భుత్వంలో, ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న పెరుగుతోంది. తాజాగా.. 24గంట‌ల వ్య‌వ‌ధిలోనే 6,060 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అంత‌కుముందు రోజు 5వేల కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో అప్ర‌మ‌త్తం అయిన  ఆదేశ అధ్య‌క్షుడు పుతిన్ వైర‌స్ వ్యాప్తిపై రోజువారీగా నివేదిక‌లు ఇవ్వాల‌ని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

 

నిజానికి.. చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్రంగా పుట్టిన క‌రోనా వైర‌స్ చూస్తుండ‌గానే ప్ర‌పంచాన్ని చుట్టుముట్టింది. కానీ.. మొద‌ట్లో చైనా ప‌క్క‌నే ఉన్న ర‌ష్యాలో మాత్రం పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. యూర‌ప్ దేశాల్లో బీభ‌త్సం సృష్టిస్తున్నా ర‌ష్యాలో మాత్రం కేసుల సంఖ్య పెద్ద‌గా పెర‌గలేదు. దీంతో అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. చైనా మిత్ర‌దేశం కాబ‌ట్టి ఏదో మ‌త‌ల‌బు ఉండిఉంటుంద‌నే అనుమానాలు జోరందుకున్నాయి. కానీ.. తాజా ప‌రిస్థితి చూస్తే మాత్రం ర‌ష్యా మ‌రో అమెరికా అవుతుందా..? అనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక మాస్కోలో ప‌రిస్థిత రోజురోజ‌కూ ఆందోళ‌న‌కంగా మారుతోంది. ఇక్క‌డ‌ 12.7 మిలియన్ల జనాభా ఉంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తికి హాట్‌స్పాట్‌గా మారింది. ఈ న‌గ‌రంలో కేసుల సంఖ్య 20,754 కు చేరుకుంది. మ‌ర‌ణాల సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉంది. అయితే, మార్చిలో మొదట ప్రవేశపెట్టిన లాక్‌డౌన్ చర్యలు ఫలించాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ అన్నారు. న‌గ‌రంలో వ్యాధి రేట్ పెరుగుతోంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: