భారత్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 16103 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 2502 మంది కోలుకున్నారు. 525 మంది మరణించారు. దేశంలో ప్ర‌ధానంగా సుమారు ప‌ది రాష్ట్రాల్లోనే అత్య‌దికంగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా కేసుల్లో టాప్‌లో ఉన్న రాష్ట్రాల వివ‌రాలను తెలుసుకుందాం.. మహారాష్ట్రలో 3648 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో  211 మంది మరణించారు. ఆ తర్వాత ఢిల్లీలో 1893 మందికి క‌రోనా సోకింది. ఇందులో 43 మంది మరణించారు.

 

గుజరాత్‌లో 1604 మంది క‌రోనా బారిన‌ పడ్డారు. ఇప్పటివరకు 58 మంది మరణించారు. రాజస్థాన్లో మొత్తం 1431 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 22 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లో 1402 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 69మంది మరణించారు. తమిళనాడులో 1372 పాజిటివ్ కేసులు నమోదు కాగా 15 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో 974 పాజిటివ్ కేసులు నమోదు కాగా 14 మంది మరణించారు. తెలంగాణలో 809 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లో 647 పాజిటివ్ కేసులు  నమోదు కాగా 16 మంది మరణించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: