అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో లాక్‌డౌన్ ముగిసే మే 3వ తేదీ వరకూ స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు నిలిపివేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 14వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి కొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కల్పిస్తామని స్పష్టం చేశారు.

 

అయితే ఏప్రిల్‌ 20 నుంచి టీవీలు, ఫ్రిజ్‌లు, ఫోన్ల విక్రయాలు జరుపుకోవచ్చంటూ కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. ‘‘డిజిటల్ ఎకానమీ అనేది ప్రభుత్వ రంగంలో చాలా కీలకమైనది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్, ఐటీ, ప్రభుత్వ కార్యకలపాల కోసం పని చేసే డేటా, కాల్ సెంటర్లు, ఆన్‌లైన్  టీచింగ్, దూరవిద్య తదితర కార్యకలపాలకు అనుమతి ఉంటుంది’’ అని కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. నిత్యవసరాలు కాని వస్తువులను ఈ-కామర్స్‌ కంపెనీలు విక్రయించడానికి లేదని స్పష్టం చేసింది. ఆహారం, ఔషధాలు, ఔషధ పరికరాలను మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఉందని.. ఈ-కామర్స్‌ విక్రయదారుల వాహనాలకు అనుమతి తప్పనిసరి అని కేంద్రం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: