తెలంగాణ‌లో  కొన‌సాగుతున్న లాక్‌డౌన్ ను మే 7 వరకు పొడిగించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.  మార్చి నుంచి 3 నెలల పాటు ఇంటి అద్దె వసూలు చేయకుండా ఇంటి యజమానులకు ఆదేశాలు ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. రాష్ట్రంలో కేసులు పెరిగితే లాక్ డౌన్ ని సడలిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ఫుడ్ డెలివరీ సర్వీసులను కూడా అనుమతించకుండా ఉంటే మంచిద‌ని సర్కార్ భావిస్తుంది.

 

ప్రస్తుతం తెలంగాణ‌ కేబినేట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ సర్కార్ తెలంగాణ‌లో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ని విధించింది. కేంద్రం మే 3 వరకు అని చెప్పింది. మ‌రోప‌క్క రాష్ట్రంలో పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితుల్లో  లాక్ డౌన్ ని పెంచడమే మంచిద‌ని సర్కార్ భావిస్తుంది.  ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రానికి తెలంగాణ‌ సర్కార్ సమాచారం కూడా పంపింది. కేబినెట్  స‌మావేశం ముగిసిన వెంట‌నే సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వ‌హించి , ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: