కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించి ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా అమాయకపు ప్రజలు బలవుతున్నారు. కరోనా వైరస్ కచ్చితంగా చైనాలోని లాబరేటరీ నుండే బయటకు వచ్చిందని నోబెల్ అవార్డు గ్రహీత లూక్ మోంటాగ్నియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీఎన్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోంటాగ్నియర్ కరోనా గురించి షాకింగ్ నిజాలను బయట పెట్టారు. కరోనా వైరస్ అడవిజంతువులనుండి వుహాన్ తడిప్రాంతపు మార్కెట్ కు వచ్చిందన్నది పచ్చి అబద్దమని అది చైనాకు చెందిన ప్రయోశాలల నుండి బయటకు వచ్చిందని మోంటాగ్నియర్ తెలియజేశారు.

 

2000 సంవత్సరం నుండి వైరస్ లపై చైనా ప్రభుత్వం వుహాన్ లో ప్రయోగాలు చేస్తున్నారని ఈ క్రమంలోనే వైరస్ బయటికి వచ్చిందని అయన పేర్కొన్నారు. వుహన్ నేషనల్ బయోసేఫ్టీ ల్యాబొరేటరీలో ఎయిడ్స్ వైరస్ కోసం వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఈ కొత్త వైరస్ పుట్టుకొచ్చిందని ఆయన అన్నారు. కరోనా వైరస్ మూలలలో ఎయిడ్స్ కి సంబందించిన మూలాలు మరియు మలేరియా జెర్మ్స్ ఉన్నట్లు అయన తెలియజేశారు. అందుకే వైరస్ సహజంగా పుట్టినట్లు తమకు అనిపించడం లేదని అన్నారు. ఇదే విషయంగురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాను వార్ణింగ్ ఇవ్వడం జరిగింది. అవును మరి ఇదే నిజం అయితే చైనా భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు అంటున్నారు నిపుణులు .

మరింత సమాచారం తెలుసుకోండి: