*క‌రోనా వైర‌స్ మాన‌వాళిని తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. మాన‌న జీవితాన్ని మార్చేస్తోంది. మ‌న వృత్తిప‌ర‌మైన‌ జీవ‌న శైలిని మార్చేసింది. క‌విడ్‌-19 యుగంలో ఇల్లే మ‌న‌కు ఆఫీస్‌.. ఇంట‌ర్నేటే స‌మావేశ‌పు గది. నేను కూడా దీనికి అలవాడు ప‌డ్డాను. మంత్రులు, అధికారుల‌తో మీడియో కాన్ఫ‌రెన్స్‌లోనే మాట్లాడుతున్నా* అని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అన్నారు. కొవిడ్‌-19 యుగంలో జీవితం గురించి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ లింక్‌డ్ఇన్‌లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను రాశారు. *2014 లో ప్ర‌జ‌లు మాకు సేవ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, మేం భారతీయులను, ముఖ్యంగా పేదలను వారి జన ధన్ ఖాతా, ఆధార్‌తో మొబైల్ నంబర్‌తో కనెక్ట్ చేయడం ప్రారంభించాం.

 

దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న అవినీతి, లంచానికి అడ్డుక‌ట్ట ప‌డింది. ఒక బటన్ క్లిక్ చేస్తే.. వారికి డ‌బ్బు బ‌దిలీ అయ్యేలా ప్ర‌భుత్వం డిజిటలైజ్ చేసింది. ఒక బటన్ ఈ క్లిక్‌తో ఎన్నో వారాల ప‌ని క్ష‌ణంలో అయిపోతుంది. స‌మ‌యం వృథాకాకుండా చేసింది. నాడు మేం తెచ్చిన విధానాలు  ఇప్పుడు కొవిడ్‌-19 విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ముఖ్యంగా పేద‌ల‌కు ఎంతో భ‌రోసాను ఇస్తున్నాయి* అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రాశారు. నాడు తాము తీసుకొచ్చిన డిజిట‌ల్‌ విధానాల వ‌ల్లే..నేడు ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉంటూ కొవిడ్‌-19పై పోరాడుతున్నార‌ని అందులో పేర్కొన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: