కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో మరో దేశాన్ని భారత్ ఆదుకుంది. ఇప్పటికే అమెరికా, బ్రిట‌న్ త‌దిత‌ర అగ్ర‌దేశాల‌కు హైడ్రాక్సీక్లోరోక్విన్‌(మ‌లేరియా నివార‌ణ మాత్ర‌లు), పారాసెట‌మాల్‌ మాత్ర‌ల‌ను భార‌త్ అందించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మందులను ఆఫ్ఘనిస్తాన్‌కు కూడా భారత్ అందజేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో భారత రాయబారి వినయ్ కుమార్ ఈ రోజు 300,000 హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు, 70,000 పారాసెటమాల్ మాత్రలను ప్రజారోగ్య మంత్రి ఫిరోజుద్దీన్ ఫిరోజ్‌కు అందజేశారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. భార‌త్ చేసిన సాయాన్ని మ‌రిచిపోలేమ‌ని పేర్కొంది.

 

మొదటి జాబితాలో సుమారు 13 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను భారత్ అందించిన విషయం తెలిసిందే. ఆ త‌ర్వాత ఆ సంఖ్య క్ర‌మంగా పెరిగింది. ఇప్పటివరకు సుమారు 55 దేశాలకు భారత్ అందజేసింది. ఈ నేపథ్యంలో భారత్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా పేషెంట్లకు అందిస్తున్న చికిత్స‌లో హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్ర‌లు ఎంతో కీల‌కంగా మారాయి. ఈ మందులు భార‌త్‌లోనే అత్య‌ధికంగా ఉత్ప‌త్తి అవుతాయి. ఈ నేప‌థ్యంలోనే అగ్ర‌రాజ్యాలు సైతం ఈ మాత్ర‌ల‌ను పంపించాల‌ని భార‌త్‌ను వేడుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: