తెలంగాణ లో కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి కేసులు పెరుగుతున్నాయి.. తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కేసులు పెరిగిపోతున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల ఈ కేసులు పెరిగాయి.. తర్వాత ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి మూలంగా కొన్ని కేసులు పెరిగాయి.  క్వారంటైన్ లో ఉన్న 26 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు.

 

 నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన కేసులే ఇప్పుడు కనిపిస్తున్నాయని అన్నారు. వాళ్లు.. వాళ్ల కుటుంబ సభ్యులు.. వారు కలిసిన వారు.. ఇలా కొన్ని కేసులు బయట పడున్నాయి.  ఎప్పటికప్పుడు ఈ కేసుల విషయం లో పర్యవేక్షణ చేస్తున్న విషయం తెలిసిందే.  ఇక్కడ వైద్య బృందం అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా పరిశీలిస్తూ వైరస్ బాధితులకు సేవలు చేస్తున్నారు.   మే 1 తేదీ తర్వాత కేసుల సంఖ్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు.  

 

తెలంగాణ లో లాక్ డౌన్ విషయం లో ప్రజలు కూడా సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు.. అక్కడక్కడ లాక్ డౌన్ ఉల్లంఘనలు కూడా చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వి చేయడం మానేస్తే వ్యాధి వ్యాప్తి పూర్తిగా అరికట్ట వొచ్చని అన్నారు. జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతినే పరిస్థితి మనకే వస్తుందని గ్రహించాలని హితవు పలికారు.  ఇప్పటి వరకు ఎన్న నిబంధనలే అమలు అవుతాయి.. గతంలో ఉన్న గైడ్ లైన్స్ అమలు చేస్తామన్నారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: