తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ పలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. లాక్‌డౌన్ పొడిగింపు మే 7వ తేదీ వ‌ర‌కు ఉంటుంద‌ని.. త‌ర్వాత ప‌రిస్థితిని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్న కేసీఆర్ య‌జ‌మానులు ఇంటి అద్దెను మార్చి, ఏప్రిల్‌, మే నెల‌కు ఇప్ప‌ట్లో వ‌సూలు చేయ‌వ‌ద్ద‌ని.. ఈ అద్దెను త‌ర్వాత ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక తీసుకోవాల‌ని.. మ‌ళ్లీ అద్దెకు వ‌డ్డీ వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని అన్నారు. ఎవ‌రైనా వ‌డ్డీ వ‌సూలు చేస్తే 100కు డ‌య‌ల్ చేసి చెప్పాల‌న్నారు.

 

ఇక ప్రైవేటు స్కూళ్ల విష‌యంలో కూడా కేసీఆర్ స్ట్రిక్ట్‌గా వార్నింగ్‌లు ఇచ్చారు. ప్రైవేటు పాఠ‌శాల‌లు వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రంకు సంబంధించి ఫీజులు వ‌సూలు చేయ‌వ‌ద్ద‌ని.. ట్యూష‌న్ ఫీజుల‌ను అది కూడా నెల‌వారీగా మాత్ర‌మే తీసుకోవాల‌ని.. ఇక ఇత‌ర‌త్రా ఏ ఫీజులు కూడా వ‌సూలు చేయ‌వ‌ద్ద‌ని.. అది ప్ర‌భుత్వ ఆర్డ‌ర్ అని కేసీఆర్ చెప్పారు. ఇక్క‌డ చెప్పిన‌ట్టు చేయ‌క‌పోతే స్కూళ్ల ప‌ర్మిట్లు ర‌ద్ద చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: