తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో కేసీఆర్ ప‌లు కీల‌క సూచ‌న‌లు జారీ చేశారు. ఇక జూన్ నుంచి వ‌చ్చే తొలిక‌రి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో రైతుల పంట‌లు వేసేందుకు సిద్ధ‌మ‌వుతుంటారు. ఈ క్ర‌మంలోనే రైతులు మే నెల‌లోనే కాంప్లెక్స్‌, యూరియా, డీఏపీ కొనుగోలు చేసుకోవాల‌ని కేసీఆర్ సూచ‌న‌లు చేశారు. ఇప్ప‌టికే వ్య‌వ‌సాయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదేశాలు జారీ చేసినందున రైతులు మే నెల నుంచే వ్య‌వ‌సాయానికి రెడీ అవ్వాల‌ని సూచించారు.

 

ఇక వ్య‌వ‌సాయ శాఖ‌కు సైతం కేసీఆర్ షాకింగ్ ఆదేశాలు జారీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో మ‌రో నెల రోజుల పాటు ఫంక్ష‌న్ల‌కు, పెళ్లిళ్ల‌కు ఎలాంటి అనుమ‌తులు ఉండ‌వ‌ని... మ‌న రాష్ట్రంలో క‌ళ్యాణ మండ‌పాలు.. ఫంక్ష‌న్ హాల్స్ దండిగా ఉన్నాయ‌ని... వీట‌న్నింటిని మ‌రో 20 రోజుల పాటు వ్య‌వ‌సాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని.. . వీటిని తాత్కాలిక గోడౌన్లుగా మార్చి రైతుల‌కు అవ‌స‌రం అయిన మందులు.. ఇత‌ర‌త్రా అవ‌స‌రాల కోసం వాడుకోవాల‌ని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: