పెన్ష‌న‌ర్ల‌కు 75శాతం వేత‌నం చెల్లిస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.  ప్రోత్సాహ‌కం కింద పోలీసుల‌కు గ్రాస్ వేత‌నంలో 10 శాతం చెల్లిస్తామ‌ని , ఆస‌రా పె న్ష‌న్లు య‌థాత‌ధంగా ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ కార్మికుల‌కు ఇంత‌కు ముందు చెప్పిన విధంగా ప్రోత్సాహం కొన‌సాగిస్తామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గ‌త నెల మాదిరిగానే వేత‌నంలో కోత‌లు ఉంటాయ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. 

 

 

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. మే 7వరకూ తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అం తేకాదు, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్ సడలింపులు ఉండవని సీఎం ప్రకటించారు. కేబినెట్‌లో చర్చించిన అనంతరం ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. అయితే.. రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపుపై నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసిందని సీఎం చెప్పారు. నిత్యావసరాలు ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయని ఆయ‌న తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: