ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు పసికందులు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. తాజాగా తెలంగాణలోనూ ఓ పసికందు కొవిడ్‌-19 వైరస్ బారినపడి మృతి చెందడం కలకలం రేపింది. తెలంగాణలో క‌రోనాతో పసికందు మృతి చెందడం ఇదే మొదటిసారి అని అధికారులు అంటున్నారు. నారాయణపేట జిల్లాకు చెందిన రెండు నెలల చిన్నారి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ చిన్నారికి నిలోఫర్ ఆస్పత్రిలో మూడు రోజుల పాటు చికిత్స నిర్వహించిన డాక్ట‌ర్లు,  వైద్య సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే.

 

ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటున్నారు. పిల్ల‌ల ప‌ట్ల మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీలోనూ నెలన్నర చిన్నారి కరోనా వైరస్‌బారిన మృతి మృతి చెందాడు. అదే ఆస్ప‌త్రిలో మ‌రో చిన్నారి కూడా క‌రోనా బారిన‌ప‌డింది. ఇక మధ్యప్రదేశ్‌లో కూడా 12 రోజుల పాప కూడా క‌రోనా వైర‌స్ బారినప‌డింది. డెలివ‌రీ స‌మ‌యంలో వైద్యసేవ‌లు అందించిన న‌ర్సు నుంచి ఈ చిన్నారికి వైర‌స్ సోకిన‌ట్లు అధికారులు తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: