ఉత్తరప్రదేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ కు క‌రోన క‌ష్టాలు వ‌చ్చి ప‌డ్డాయి. యోగి  తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ ఆరోగ్యం విషమించింది.  కుటుంబ సభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో త‌ర‌లించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఆందోళ‌న‌క‌రంగా ఉందని, వైద్యానికి స్పందించడం లేదని సమాచారం. దీంతో  వైద్యులు ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

ఆయనకు గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా కిడ్నీ, కాలేయ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. డయాలసిస్ కూడా చేస్తున్నట్టు సమాచారం. గ్యాస్ట్రో విభాగానికి చెందిన డాక్టర్ వినీత్ అహుజా బృందం యోగి తండ్రికి వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే కరోనా పాజిటివ్‌ కేసులు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో  వెయ్యి దాటాయి. సీఎం యోగీ రాష్ట్రంలో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్ప‌డు అధికార యంత్రాంగంతో స‌మీక్షిస్తున్నారు.  ఈనేప‌థ్యంలోనే త‌న తండ్రిని చూడటానికి కూడా ముఖ్య‌మంత్రి వెళ్ల‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: