దేశంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.  కొంత మంది లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నారు.. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి మరింత పెరిగిపోతుంది.. ఇందుకోసం అందరూ ఇంటి పట్టున ఉండాలి.. బయటకు వస్తే మాస్క్ ధరించాలి.. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, సెలబ్రెటీలూ ప్రతిరోజూ చెబుతూనే ఉన్నారు.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి మీడియాలో మాట్లాడుతూ..
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ పెరిగిపోతుంది.  కరోనా వల్ల కష్టాలు ఉన్నాయి.. అయితే  ఈ కరోనా మనకు చాలా గుణపాఠాలు నేర్పింది.. ముఖ్యంగా  పరిశ్రభత నేర్పింది.. నేచర్ ను అందంగా చూపిస్తుంది... ఫ్యామిలీ బాండింగ్ పెంచింది.. అన్నారు.

 

 సిసిసీ ఏర్పాటు చేయడం వల్ల సినీ కార్మికులకు ఎంతో మేలు జరిగిందని అన్నారు.  చాలా మంది సహనటులు తమ వంతు విరాళాలు ఇస్తూ వారికి గుండె ధైర్యాన్ని నింపుతున్నారు.  ఆకలి అన్నప్పుడే అన్నం పెట్టాలి.. అప్పడు దాని విలువ తెలుస్తుంది.. ఇప్పుడు కరోనా వల్ల ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు.. ఈ సమయంలో వారిందరికి మనకు తోచిన విధంగా సహాయం అందేలా చూడలి. 

 

విరాళాలు సేకరణ వెనుక బిగ్ బీ అమితాబ్ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. రూ.15 లక్షల విరాళంతో పాటు రామోజీ రావు ఇచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. తలసేమియా, లుకేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్త దానానికి ప్రజలు ముందుకు రావాలి అన్నారు. నిన్న మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లోని  బ్లడ్ బ్యాంక్ లో ఆయన రక్తదానం చేశారు. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన పాటించారు.

 

 

రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: