ఒక ప‌క్క క‌రోనా కేసుల‌తో స‌త‌మ‌తం అవుతున్న మహారాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇద్దరు సాధువుల హత్యోదంతం కొత్త త‌ల‌నొప్పులు తెచ్చి పెడుతోంది.  పాల్‌ఘర్‌లో ఇద్దరు సాధువుల హత్యలపై ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ నెల 16వ తేదీన లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో రాత్రిపూట వెయ్యిమంది ఓ వాహనంపై దాడి చేశారు. వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులను, డ్రైవర్‌ను కర్రలు, రాడ్లు, రాళ్లతో కొట్టి చంపారు. సాధువులు తమ గురువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. అక్కడే  పోలీసులున్నా వారు సాధువులను కాపాడలేకపోయారు. 

 

దొంగలు సంచరిస్తున్నారనే పుకార్లతో దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. దాడికి సంబంధించి 110 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 9 మంది మైనర్లు కూడా ఉన్నారు. మైనర్లను జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. మిగతా నిందితులు ఏప్రిల్ 30 వరకూ పోలీస్ కస్టడీలో ఉంటారు. పుకార్లు ఎవరు సృష్టించారు, అంత పెద్ద సంఖ్యలో జనం అక్కడ ఎలా గుమికూడారనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.  సాధువుల దారుణ హత్యలపై బీజేపీ మండిపడింది. ఉన్నతస్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: