ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు త‌న 70వ పుట్టిన రోజు జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు త‌మ పార్టీ నేత‌లతో పాటు జాతీయ స్థాయిలో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు సైతం పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. ఏపీలో పార్టీ నాయ‌కులు అంద‌రు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన ఏపీ సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సైతం చంద్ర‌బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా చెప్పారు. చంద్ర‌బాబుకు దేవుడు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని.. జ‌గ‌న్ పోస్ట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: