క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించగానే ఎక్క‌డివారు అక్క‌డే చిక్కుకుపోయారు. ఈ క్ర‌మంలోనే మార్చి 24న నుంచీ ఓ వ్య‌క్తి ఏకంగా అడ‌విలో చిక్కుకుని గుహ‌లో త‌ల‌దాచుకుంటున్న విష‌యం ఆల‌స్యంగా వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌ జిల్లాలోని ఓ గుహలో తలదాచుకున్నఆ వ్య‌క్తిని ప‌శువుల కాప‌రులు గుర్తించ‌డంతో విష‌యం బ‌ట‌య‌కు తెలిసింది. లాక్‌డౌన్‌ ప్రకటించిన సమయంలో నర్మదా పరిక్రమ యాత్రలో ఉన్న ముంబైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్వీరేంద్ర సింగ్‌ డోగ్రా  అటవీ ప్రాంతంలో చిక్కుకున్నాడు. ఉదయ్‌పుర ప్రాంతంలోని అడవుల్లోని ఓ గుహలో ఉంటున్న అత‌న్ని అక్కడి పశువుల కాపరులు గుర్తించి వెంట‌నే అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.

 

వెంట‌నే అప్ర‌మ‌త్తమైన‌ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని వివ‌రాలు సేక‌రించారు.  ఆయ‌న వ‌ద్ద కొన్ని దుస్తులు, మహాభారతం పుస్తకం ఉంద‌ని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌ నుంచి గుజరాత్‌ వరకూ నర్మదా నదీపరీవాహక ప్రాంతంలో ఆయ పర్యటన చేపట్టారని చెప్పారు. ఆదివారం సాయంత్రం అటవీ ప్రాంతంలోని గుహలో వీరేంద్ర సింగ్‌ను పోలీసులు కందర్వి గ్రామంలోని బంధువు ఇంటికి తరలించడంతో క‌థ సుఖాంతం అయింది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: