భార‌త్‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య సోమ‌వారం రాత్రి వ‌ర‌కు 17,656కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 14,255.  2, 841మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశ వ్యాప్తంగా మొత్తం 559 మంది మ‌ర‌ణించారు. అయితే.. ఇందులో కొన్ని రాష్ట్రాల్లో మాత్ర‌మే మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. ఆదివారం సాయంత్రం నుంచి మొత్తం 40 మరణాలు సంభవించాయి.  మహారాష్ట్రలో 223 మంది, మధ్యప్రదేశ్‌లో 74, గుజరాత్‌లో 67,  ఢిల్లీలో45, తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్ 20మంది మృతి చెందారు.

 

ఉత్తరప్రదేశ్‌లో మరణించిన వారి సంఖ్య 17కు చేరుకుంది. పంజాబ్, కర్ణాటకలలో 16 మంది మరణించారు. తమిళనాడులో ఇప్పటివరకు 15మంది మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత‌ రాజస్థాన్ 14, పశ్చిమ బెంగాల్ 12 మరణాలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, కేరళలో ముగ్గురు, హర్యానాలో ముగ్గురు మ‌ర‌ణించారు. జార్ఖండ్, బీహార్లలో రెండు మరణాలు సంభవించాయి. మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, అస్సాం ఒక్కొక్క మ‌ర‌ణం సంభ‌వించిన‌ట్లు అధికారవ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: