కరోనా క‌ట్ట‌డికి సౌదీ అరేబియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  వైరస్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో రంజాన్ మాసంలోనూ ముందుజాగ్రత్త చర్యగా మక్కా నగరంలోని అల్ హరం. అల్ నబవీ మసీదులను మూసివేస్తూ ఆ దేశ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రంజాన్ ఉపవాసాల సందర్భంగా ప్రపంచంవ్యాప్తంగా లక్షలాది మంది హజ్ యాత్రకు వచ్చిన భక్తులు ఈ మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. 

 

కరోనా ప్రబలుతున్న దృష్ట్యా ఈ ఏడాది రెండు మసీదుల్లోనూ ప్రార్థనలు నిలిపివేయాలని నిర్ణయించామని ఈ మసీదుల ప్రెసిడెంట్ జనరల్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ తాజాగా తెలిపారు. రంజాన్ సందర్భంగా ముస్లిములు ఉపవాసాలు ఉండటంతోపాటు తరావీ నమాజులు చేస్తుంటారు. తరావీ నమాజులతో పాటు రంజాన్ ఈద్ నమాజ్ కూడా ఇళ్లలోనే చేసుకోవాలని సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ షేఖ్ కోరారు. కరోనా వైరస్ ప్రబలుతున్నందున గత నెలలోనే సౌదీ అరేబియాలోని మక్కా పవిత్ర మసీదుల్లో ప్రార్థనలను ఆ దేశ సర్కారు నిలిపివేసింది. సౌదీఅరేబియాలో పదివేలమందికి కరోనా వైరస్ సోకగా, ఇందులో 103 మంది మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: