దేశ రాజ‌ధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. సోమవారం అర్ధ‌రాత్రి నాటికి కరోనా కేసుల సంఖ్య 2,003కి చేరింది. మరోవైపు వైరస్‌ కారణంగా 45 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఢిల్లీ వీధుల్లో వ్యాప్తిచెందిన వైరస్‌ తాజాగా ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్‌కూ పాకింది. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబ సభ్యుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. 

 

దీంతో పారిశుధ్య కార్మికుడికి కూడా వైరస్‌ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే అంతకుముందే అతడి కుటుంబంలో ఒకరు వైరస్‌ కారణంగా మృతి చెందారు. తాజాగా అతని కూడా వైరస్‌ సోకడంతో పరిసర ప్రాంతాల్లోని 125 కు టుంబాలను అధికారులు స్వీయ నిర్బంధంలోకి పంపించారు. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఉద్యోగులతో పాటు ఆయా పరిసర ప్రాంతాల్లోని ప్రజలెవ్వరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. మొత్తం  125 కుటుంబాల్లో 500 మందిని స్వీయ నిర్బంధంలోకి పంపినట్లు ఢిల్లీ వైద్యులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: