దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కేసులే కాకుండా కేసుల శాతం కూడా పెద్ద ఎత్తున్నే పెరుగుతుంది.  కాగా ముంబైలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.  ఏ ముహూర్తంలో ఈ కరోనా దేశంలో అడుగు పెట్టిందో కానీ.. కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  ఓ వైపు లాక్ డౌన్ మరోవైపు కెసులు పెరుగుదల తో మనిషి భయం గుప్పిట్లో బతుకుతున్నారు.  గడిచిన 24 గంటల్లో కరోనాతో 47 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం ఉదయం వెల్లడించింది. కొత్తగా 1336 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది.

 

మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,601కి చేరింది. ఇప్పటి వరకు దేశంలో కరోనాతో 590 మంది మరణించారు. 3,252 మంది కోలుకున్నారు.  దేశంలో కరోనా కేసులు నమోదవుతున్న తొలి నాళ్లలో ముంబైలో ఇంత పెద్ద ఎత్తున ప్రభావం కనిపించకపోయినప్పటికీ రోజులు గడుస్తున్నా కొద్దీ తీవ్రమైంది. 

 

మహారాష్ట్రలో అత్యధికంగా 4,666 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 232 మంది మృతి చెందారు. 2081 పాజిటివ్‌ కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది.  గుజరాత్‌లో 1,939, రాజస్థాన్‌లో 1,576, తమిళనాడులో 1,520, మధ్యప్రదేశ్‌లో 1,485, ఉత్తరప్రదేశ్‌లో 1,184, తెలంగాణలో 872, ఏపీలో 722, కర్ణాటకలో 408, కేరళలో 407 కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో 47, గుజరాత్‌లో 71 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: