దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు 18, 601కి చేరుకున్నాయి. అందులో 14, 759 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 3,252 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అటు మ‌ర‌ణాల సంఖ్య 590కి చేరిన‌ట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో 47 మ‌ర‌ణాలు సంభ‌విస్తే.. 1336 కొత్త కేసులు న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం..

 

కాగా దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు మ‌హారాష్ట్ర‌లో నమోద‌వుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 4,666 కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క ముంభై న‌గ‌రంలోనే 3000ల‌కు పైగా కేసులు న‌మోద‌వ‌డం క‌ల‌క‌లం రేపు తోంది. మ‌హారాష్ట్ర త‌ర్వాత ఢిల్లీలో 2, 801 కేసులు, గుజ‌రాత్‌లో 1, 939, రాజ‌స్థాన్‌లో 1, 576, త‌మిళ‌నాడులో 1,520,  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 1, 485 , ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో 1, 184 కేసులు న‌మోద‌య్యాయి. కాగా అటు నాగాలాండ్ లో క‌రోనా కేసులు జీరో అని  ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: