మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని బోపాల్‌లో యూనియ‌న్ కార్బైడ్ ఫ్యాక్ట‌రీలో మిథేల్ ఐసోసెనేట్ విష‌వాయుడు లీక్ అయ్యి ద‌శాబ్దాలు గ‌డుస్తున్నా ఇప్ప‌ట‌కీ నాడు ఆ విష‌వాయుడు ప్ర‌భావానికి లోనైన వారు ప‌డుతోన్న బాధ‌లు అన్నీ ఇన్నీ కావు. నాడు ఆ విష‌వాయుడు పీల్చి చ‌నిపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక నాడు ఆ విష‌వాయువు పీల్చి బ‌తికిన వారిలో త‌ర‌త‌రాలుగా శ‌రీరంలో ఏదో ఒక వైకల్యం వ‌స్తూనే ఉంది. ఇప్ప‌ట‌కీ ఆ విష‌వాయువు ప్ర‌భావానికి లోనైన వారిలో రెండు, మూడు త‌రాల వాళ్లు కూడా అంగ‌వైక‌ల్యంతో ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు.

 

విచిత్రం ఏంటంటే అంత ప్ర‌మాద‌క ప‌రిస్థితుల్లోనూ బతికి బయటపడ్డ వారు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. ఏప్రిల్‌ 17వ తేదిన ఒక వ్యక్తి మరణించగా, మరో 60 ఏళ్ల‌ వ్యక్తి ఏప్రిల్‌ 14వ తేదీన మరణించాడు. అంటే దీనిని బ‌ట్టి క‌రోనా ఎంత ప్ర‌మాద‌క‌రంగా మారిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక చ‌నిపోయిన వ్య‌క్తి గ‌త కొన్నేళ్లుగా భోపాల్ గ్యాస్‌ బాధితుల కోసం పనిచేస్తున్నట్లు పీటీఐ తెలిపింది. బాధితులు ఇద్దరు మరణం తరువాత నమూనాలు సేకరించి పరీక్షించగా పాజిటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: