కోవిడ్‌-19 ఈ పేరు వింటేనే ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచాన్ని హ‌డ‌లెత్తిస్తోన్న ఈ వైర‌స్ ఇప్పుడు మ‌న‌దేశాన్ని కూడా గ‌జ‌గ‌జ వ‌ణికించేస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలో వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఏకంగా 40 రోజుల‌కు పైగా దేశం అంతా లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ లాక్‌డౌన్ చాలా క‌ఠినంగా అమ‌లు అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

 

ఇదిలా ఉంటే క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు మాస్క్ ధరించడం, సామాజిక దూరం వంటి నియమాలు త‌ప్ప‌నిస‌రి. అయితే ఓపెన్ ప్లేసుల్లో క‌రోనా వైర‌స్ ఎంత దూరం ప్ర‌యాణిస్తుంది అన్న‌దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన క్లారిటీ లేదు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అర్ధమయ్యేలా ఓ ట్వీట్ ద్వారా వివరించింది. ఈ వైర‌స్ సోకిన వ్య‌క్తి నుంచి గాలిలో 1.5 మీటర్లు వైరస్ ప్రయాణిస్తుంది. అదే ఆ వ్యక్తి దగ్గినప్పుడు రెండు మీటర్లు, తుమ్మినప్పుడు ఏకంగా ఎనిమిది మీటర్ల దూరం వరకూ వైరస్ గాలిలో ప్రయాణిస్తుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: