ఓ వైపు క‌రోనా వైర‌స్ రెచ్చిపోతుండ‌గానే.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ ఈ రోజు జ‌రుగుతుంది. బీజేపీకి చెందిన నరోత్తం మిశ్రా, కమల్ పటేల్, మీనా సింగ్, తులసి సిలావత్, గోవింద్ సింగ్ రాజ్‌పుత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇందులో సింథియా అనుచ‌రుల‌కే పెద్ద‌పీట వేశారు. ఇదిలా ఉండ‌గా.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ పెరుగుతోంది. మార్చిలో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌.. అప్ప‌టినుంచి మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌లేదు. మంత్రివ‌ర్గం లేక‌పోవ‌డంతో రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ముఖ్య‌మంత్రి స‌రైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోయార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

 

ఇదే స‌మ‌యంలో ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులంద‌రూ క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో ప‌రిస్థితి మొత్తంగా అదుపులేకుండా పోయింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. సుమారు 35మంది భోపాల్ గ్యాస్ బాధితుల‌కు చికిత్స అందించే ఆస్ప‌త్రిని క‌రోనా పేషెంట్ల‌కు కేటాయించ‌డంతో గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి మంత్రి ముఖ్య‌మంత్రి మంత్రివ‌ర్గం ఏర్పాటు చేశారు. ఇప్ప‌టికైనా రాష్ట్రంలో ప‌రిస్థితి ఏమైనా మెరుగుప‌డుతుందో లేదో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: