కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కాలం కు గాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 1500 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నేరుగా జమ చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జూలూరుపాడు మండలం కేంద్రంలో పేదలను అడిగి వారితో  ముచ్చటించారు. ఆ ప్రాంతీయ వాసులను వారి సమస్యలను అడిగి  తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్   ఎంవీ రెడ్డి, ఎమ్మెల్యే రాములు నాయక్ మరియు జడ్పీ చైర్పర్సన్ కోరం కనకయ్య లతో కలసి బ్యాంకులను సందర్శించారు.

 

బ్యాంకు ఖాతాలో నగదు పడిందా అని ఖాతాదారులతో అడిగి తెలుసుకున్నారు.  నగదు పంపిణీలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంలో బ్యాంకుల వద్ద  టెంట్, కుర్చీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంత గుమికూడకుండా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. ప్రభుత్వం నుంచి మంజూరు కాబడిన పదిహేను వందల రూపాయలు అకౌంట్లో పడింది అన్న సమాచారాన్ని తెలుసుకొని అందరూ గుంపులు గుంపులుగా బ్యాంకు వద్దకు వెళ్లవద్దని ఈ సందర్భంగా  విజ్ఞప్తి చేశారు... ఈ విధంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు

 

మరింత సమాచారం తెలుసుకోండి: