జీవితంలో ఎంత గొప్ప పొజీషన్లోకి వచ్చినా.. ఎంత గొప్ప మనుషులైనా వారికి ఇష్టమైన విషయంలో కాంప్రమైజ్ అవుతుంటారు.  ఆ తర్వాత తాము ఆ పని చేయకలేకపోయామే అని బాధపడటం.. పశ్చాతప పడటం జరుగుతుంది.  తాజాగా తన  జీవితంలో ఎంతో ఇష్టమైన ఆర్కిటెక్ట్‌గా ఎంతోకాలం ప్రాక్టీస్‌ చేయలేకపోయానని రతన్‌ టాటా పశ్చాత్తాపం చెందారు. ఆర్కిటెక్ట్‌ రంగం అంటే ఎంతో ఇష్టం ఉండేదని.. ఆ రంగం తనను ఎంతో ప్రభావితం చేసిందని అన్నారు.

 

అయితే తన తండ్రి కోరిక మేరకు రెండేండ్లు ఇంజినీరింగ్‌ చదివానని, ఆ తర్వాత కుటుంబ వ్యాపారాల్లో మునిగిపోయానని చెప్పారు. టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌'పై కార్ప్‌గిని నిర్వహించిన ఆన్‌లైన్‌ సెమినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మనసులో ఉన్న మాటలు వెలుబుచ్చారు. 1959లో కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్‌ డిగ్రీని పొందానని తెలిపారు. 

 

ఆ సమయంలో లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ ఆర్కిటెక్ట్‌ ఓ ఆఫీస్ లో వర్క్ కూడా చేశానని అన్నారు.  వాస్తవానికి తాను ఎప్పుడూ ఓ ఆర్కిటెక్ట్‌గానే ఉండిపోవాలని అనుకోలేదని, అయితే ఇష్టపడి చదివి దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయలేకపోయానన్న బాధే ఉందన్నారు. తర్వాత వ్యాపార రంగంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని వదిలేశాననిన అన్నారు.  కానీ తాను  ఆర్కిటెక్ట్‌గా ఎంతోకాలం ప్రాక్టీస్‌  అప్పుడప్పుడు బాధపడుతుంటానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: