క‌రోనా వైర‌స్‌కు కేంద్ర‌బిందువుగా ఉన్న చైనాపై రోజురోజుకూ అంత‌ర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. వుహాన్‌న‌గ‌రం కేంద్రంగా డిసెంబ‌ర్‌లోనే క‌రోనా వైర‌స్ పుట్టినా.. చైనా బ‌య‌టి ప్ర‌పంచానికి చెప్ప‌కుండా దాయ‌డంలో దారుణ‌మైన స్వార్థం ఉంద‌నే వాద‌న రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోంది. ముంద‌స్తుగానే కొవిడ్‌-19కు వ్యాక్సిన్ క‌నిపెట్టి అంత‌ర్జాతీయంగా వ్యాపారం చేయ‌డానికే  చైనా కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింద‌నే ఆరోప‌ణ‌లు పెరుగుతున్నాయి. నిజానికి మొద‌టి నుంచీ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఒక ద‌శ‌లో దీనిని చైనీస్ వైర‌స్ అని కూడా ట్రంప్‌ రెచ్చిపోయారు. ఇటీవ‌ల ఫ్రెంచ్ శాస్త్ర‌వేత్త. నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. క‌రోనా వైర‌స్‌ను మ‌నిషే సృష్టించాడ‌ని, అది చైనాలోని వుహాన్ న‌గ‌రంలో ఉన్న‌ల్యాబ్‌లోనే జ‌నించిందని అన్నారు.

 

 ఈ క్ర‌మంలోనే ఆస్ట్రేలియా కూడా అమెరికాకు జ‌త‌క‌లిసింది. క‌రోనా వైర‌స్‌పై అంత‌ర్జాతీయ విచార‌ణ‌చేప‌ట్టాల‌ని కోరింది. తాజాగా.. అమెరికా వైట్‌హౌస్ వాణిజ్య స‌ల‌హాదారుడు పీట‌ర్ న‌వారో కూడా స్పందించారు. క‌రోనాకు వ్యాక్సిన్ సృష్టించి, ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను పొందేందుకు చైనా ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, అందులో భాగంగానే వైర‌స్తో త‌లెత్తే ప్ర‌మాదం గురించి బ‌య‌టి ప్ర‌పంచాన్ని హెచ్చ‌రించలేద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ క్ర‌మంలో డొనాల్డ్ ట్రంప్ మ‌రో అడుగుముందుకు వెశారు. చైనాకు ద‌ర్యాప్తు బృందాన్ని పంపుతామ‌ని ప్ర‌క‌టించారు. అయితే.. దీనిని చైనా తీవ్రంగా ఖండించింది. త‌మ‌దేశంలో ద‌ర్యాప్తు చేయ‌డానికి అనుమ‌తించ‌బోమ‌ని తేల్పిచెప్పింది. ఇదిలా ఉండ‌గా.. చైనా క‌రోనాకు వ్యాక్సిన్ క‌నిపెట్టే దిశ‌గా వేగంగా అడుగులు వేస్తోంది. మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని రెండోద‌శ ట్ర‌య‌ల్స్‌ను చేప‌డుతోంది. వేగంగా చోటుచేసుకుంటున్న ఈ ప‌రిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి మ‌రి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: