లాక్‌డౌన్ కార‌ణంగా జ‌నం ఇళ్ల‌కే ప‌రిమితం అయిపోయారు. ఇక అడ‌విలో ఉన్న జంతువులు స్వేచ్ఛ‌గా తిరుగుతున్నాయి. ప‌లుచోట్ల గ్రామాలు, న‌గ‌రాల్లోకి కూడా వ‌స్తున్నాయి. కొద్దిరోజులుగా జంతులు రోడ్ల‌పై వ‌స్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే.. ఇదే అద‌నుగా కొంత‌మంది ఫేక్‌ వీడియోల‌ను కూడా అప్‌లోడ్ చేస్తున్నారు. అది ఎక్క‌డో జ‌రిగితే.. ఇక్క‌డే జ‌రిగింద‌ని.. ఇప్పుడే జ‌రిగిందంటూ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో అవి తెగ వైర‌ల్ అవుతున్నాయి...

 

ఈ క్ర‌మంలోనే  హైదరాబాద్‌లో చిరుతపులి రోడ్డు దాటుతున్నట్లు చూపించే వీడియో మంగళవారం ఉదయం వైరల్‌గా మారింది. కొంద‌రు దీనిని కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ నుంచి తీసిన‌ట్లు చెబుతున్నారు. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను షేర్ల‌మీద షేర్లు చేశారు. మొద‌ట ఈ వీడియోను అదిల్ బుఖారీ అనే వ్య‌క్తి అప్‌లోడ్ చేశాడు. రోడ్ నంబర్ 12, బంజారా హిల్స్ సమీపంలో ఉదయం 12 గంటలకు చూసిన‌ట్లు అందులో పేర్కొన్నాడు. అయితే, ఫేక్‌న్యూస్‌ను క‌నిపెట్టే రాకేశ్‌రెడ్డి ఈ వీడియోలో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో చెక్ చేశారు. ఈ వీడియో తిరుపతిలో తీసింద‌ని, ఏప్రిల్ 18 నుండి తెల్లవారుజామున 3.11 గంటలకు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు అయింద‌ని తేల్చాడు. ఫేక్ న్యూస్‌ను గుర్తించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి రాకేశ్‌రెడ్డి ప‌నిచేస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: