కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 90శాతం ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని ప్రభుత్వం మొదట భావించింది. కానా వీటి ద్వారా... 5.4 శాతం ఖచ్చితమైన ఫలితాలు మాత్రమే వస్తున్నాయని  తేలింది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చిన రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్లను ఇప్పటికిప్పుడు వినియోగించవద్దని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ, కనీసం రెండురోజుల పాటు రాపిడ్ టెస్టింగ్ కిట్లను వాడద్దంటూ ఆదేశించింది. కాగా, ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఏపీతో పాటు పలు ప్రభుత్వాలు ర్యాపిడ్ కిట్లను దిగుమతి చేసుకొని పరీక్షలు చేస్తున్నాయి.

 

తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం సౌత్ కొరియా నుంచి 5 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్ల దిగుమతికి ఆర్డర్ ఇచ్చింది. ఐతే ఈ టెస్ట్ కిట్లకు సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వం షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. రాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా ఖచ్చితమైన ఫలితాలు రావడం లేదని స్పష్టం చేసింది.  ఐసీఎంఆర్ అంటువ్యాధుల విభాగం చీఫ్ డాక్టర్ రమణ్ ఆర్ గంగాఖేడ్కర్  ఇవాళ ఓ ప్రకటన చేశారు. ‘‘రెండు రోజుల పాటు రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించవద్దు.

 

చాలా వ్యత్యాసాలు ఉన్నందున, కొత్త కిట్లను పరీక్షించి, ధ్రువీకరించాల్సి ఉంది. అనంతరం వచ్చే రెండ్రోజుల్లో మళ్లీ దీనిపై మార్గదర్శకాలు విడుదల చేస్తాం.. అని గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. ఈ కిట్లలో పాజిటివ్ పేషెంట్లకు కూడా నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయంటూ  రాజస్థాన్ ఆరోగ్య మంత్రి రఘుశర్మ ఆరోపించారు. కాగా ఐసీఎంఆర్ దేశ వ్యాప్తంగా వివిధ అనుబంధ ల్యాబ్‌ ద్వారా ఇప్పటి వరకు 4,49,810 కరోనా శాంపిళ్లను పరీక్షించింది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: