వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌.. సాయం కోసం ఎదురుచూస్తోంది..  సాయం చేయండంటూ వేడుకుంటోంది.. అదేమిటీ.. ఆమెకేం క‌ష్టం వ‌చ్చింద‌ని అనుకుంటున్నారా..? క‌ష్టం వ‌చ్చింది ఆమెకు కాదండీ.. నోరులేని మూగ‌జీవాల‌కు..! మూగ‌జీవాల కోసం నాకు సాయం చేయండి.. ఆహారం కోసం అవి మిమ్మ‌ల్ని అడుగులేవు..వాటి కోసం నాకు సాయం చేయ‌డంటూ వేడుకుంటోంది. మీరు నాకు సాయం చేస్తే.. నేను ఆ మూగ‌జీవాల‌ను ఆదుకుంటానంటూ ప్ర‌చారం చేస్తోంది. మీరిచ్చే ప్ర‌తీ పైసాకు లెక్క ఉంటుంది. ఈ మేర‌కు ఆమె నిర్వ‌హిస్తున్న శ‌క్తిఫౌండేష‌న్‌ బ్యాంకు అకౌంట్ నంబ‌ర్‌ను కూడా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

 

నిజానికి.. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్‌గానేకాకుండా లేడీ విల‌న్‌గాకూడా త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకుంది.  ఎనిమ‌ల్ ల‌వ‌ర్‌గా కూడా ఆమె ప‌ని ప‌నిచేస్తోంది. మూగ‌జీవాల‌ను కంటికిరెప్ప‌లా చూసుకుంటోంది. అంతేగాకుండా స్త్రీవాది కూడా. ఎలాంటి విష‌యాన్ని అయినా.. సూటిగా చెప్పేస్తుంది వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్‌కుమార్‌. ఇక మూగ‌జీవాల కోసం వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ జీవాల కోసం చేప‌డుతున్న కార్య‌క్ర‌మానికి అన్నివ‌ర్గాల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: