మాన‌వ‌మృగం.. న‌ర‌మాంస‌భ‌క్ష‌కులు.. ఈ పేర్లు ఊరిక‌నే రాలేదు.. స‌మాజంలో అలాంటి మ‌నుషులు ఉన్నారుకాబ‌ట్టే ఆ పేర్లు నిలిచిపోతున్నాయి. తాజాగా.. ఉక్రేనియాలో కూడా ఓ న‌ర‌మాంస‌భ‌క్ష‌కుడి ఉదంతం బ‌య‌ట‌ప‌డింది. ఉక్రేనియాలోని క్రివ్యి రిహ్‌కి చెందిన అలెగ్జాండర్(41)కు 50 ఏళ్ల ప్రియురాలు ఉంది. ఇద్ద‌రూ క‌లిసే ఉంటున్నారు. ఒక‌రోజు మందు పార్టీ చేసుకోవాల‌ని అనుకున్నారు. అంతా రెడీ చేసుకున్నారు. కానీ.. మందులోకి నంజుకోవ‌డానికి ఏమీ లేదు. అప్ప‌టికే మ‌ద్యంమ‌త్తులో ఉన్న అలెగ్జాండర్ ఎవ‌రూ ఊహించ‌ని దారుణానికి ఒడిగట్టాడు. వెంట‌నే కిచెన్‌లోకి వెళ్లి  కత్తి తీసుకొచ్చి ఏకంగా ప్రియురాలి గొంతుకోశాడు. ఆ త‌ర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. రెండు కాళ్లను దాచుకుని మిగిలిన శరీర భాగాలను ఓ సంచిలో చుట్టేసి వారు ఉంటున్న ఇంటికి సమీపంలోనే ఉన్న నదిలో పారేసాడు. 

 

మ‌రునాడు.. ఇదే ప్రాంతానికి చెందిన వ్య‌క్తి త‌న పిల్ల‌ల‌తో క‌లిసి స‌ర‌దాగా చేప‌లు ప‌ట్టేందుకు వెళ్లాడు. ఈక్ర‌మంలో ఆ సంచిని గ‌మ‌నించి షాక్ తిన్నాడు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు స్థానికుల‌ను విచారించారు. అక్కడి స్థానికులు మహిళ శరీర భాగాలను చూసి ఆమెను అలెగ్జాండర్ ప్రియురాలిగా గుర్తించారు. వెంట‌నే వారు ఉంటున్న ఇంటికి వెళ్లిన పోలీసులు అక్క‌డి దృష్యాన్ని షాక్ తిన్నారు.  ప్రియురాలి కాళ్ల నుంచి తీసిన మాంసాన్ని పెనంపై వేసి వేయించుకుని ఆ పక్కనే కూర్చుని కాలిన మాంసాన్ని తింటున్న అలెగ్జాండర్‌ని చూసి పోలీసులు భీతిల్లిపోయారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇంట్లోనే ప్రియురాలిని అత్యంత‌ దారుణంగా హత్య చేసి ముక్కలుముక్కలుగా నరికేసినట్లు పోలీసులు గుర్తించారు. అత‌న్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: