ఛీ చైనా..! క‌రోనా వైర‌స్‌కు కేంద్ర‌బిందువుగా మారి.. ప్ర‌పంచాన్ని ఆగ‌మాగం చేస్తోంది. అనేక దేశాల‌ను శ‌వాల‌దిబ్బ‌లుగా మారుస్తోంది. ఇక ఆప‌ద‌లో సాయం పేరుతో అవ‌మాన‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇటీవ‌ల పాకిస్తాన్‌కు మిత్ర‌దోహం చేసింది.. అండ‌ర్‌వేర్ల‌తో త‌యారు చేసిన మాస్క్‌ల‌ను పాకిస్తాన్‌కు పంపి దారుణంగా అవ‌మానించింది. ఈ విష‌యాన్ని అక్క‌డి మీడియా ప‌సిగ‌ట్ట‌డంతో చైనా బుద్ధి బ‌య‌ట‌ప‌డింది. తాజాగా..మొన్న‌టికి మొన్న ఇండియాకు కూడా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల‌ను పంపింది. వీటితో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను వేగంగా చేప‌ట్ట‌వ‌చ్చని చెప్పింది. 95శాతం క‌చ్చిత‌మైన ఫ‌లితం ఇస్తుంద‌ని చెప్పుకొచ్చింది. తీరా చూస్తే.. చైనా పంపిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కేవ‌లం 5.4శాతం ఫ‌లితాన్ని ఇస్తున్నాయ‌ని తేలింది. దీంతో అవాక్కైన రాజ‌స్తాన్ ప్ర‌భుత్వం ఏకంగా చైనా కిట్ల‌ను ప‌క్క‌న‌ప‌డేసింది. ఇదే విష‌యాన్ని మంగ‌ళ‌వారం భారతీయ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కు చెప్పింది. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన ఐసీఎంఆర్ కూడా చైనా కిట్ల‌ను ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని రాష్ట్రాల‌ను అల‌ర్ట్ చేసింది. 

 

చైనా పంపిని కిట్లు 90శాతం క‌చ్చితత్వానికి వ్యతిరేకంగా 5.4శాతం ఫలితాలను మాత్రమే ఇచ్చాయ‌ని, అవి ఎందుకూ ప‌నికి రావ‌ని రాజ‌స్తాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ అన్నారు. ఇదే విష‌యాన్ని ఐసిఎంఆర్‌కు చెప్పిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఐసిఎంఆర్ డాక్టర్ రామన్ ఆర్ గంగాఖేద్కర్ మాట్లాడుతూ చైనా కిట్ల‌పై మూడు రాష్ట్రాల నుండి ఫిర్యాదులను స్వీక‌రించిన‌ట్లు తెలిపారు. ఈ పరికరాలను పూర్తిస్థాయిలో ప‌రీక్షించే వ‌ర‌కు  వాటి వాడకాన్ని నిలిపివేయాల‌ని కోరారు. రాజస్థాన్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 1576 కోవిడ్ -19 కేసులు న‌మోదుకాగా, 25 మంది మరణించారు. అయితే.. గత శుక్రవారం, జైపూర్‌తో సహా హాట్‌స్పాట్లలో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల‌ను ఉప‌యోగించ‌గా త‌ప్పుడు ఫ‌లితాలు రావ‌డంతో వాటి వాడ‌కాన్ని నిలిపివేశారు. రాజస్థాన్ ప్రభుత్వం ఐసిఎంఆర్ ద్వారా 30,000 కిట్లను ఉచితంగా పొందగా, 10,000 కిట్లను 540 రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: