కరోనా వైరస్ నివారణకు మెరుగైన చర్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతూనే ఉంది. వైరస్ నిర్ధారణ పరీక్షల సామర్ధ్యాన్ని నానాటికీ పెంచుకుంటూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో  ప్రతిరోజు నిర్వహిస్తున్నా కరోనా పరీక్షల్లో అధిక పెరుగుదల నమోదు చేసుకుంటుంది .కరోనా పరీక్షల్లో గతంలో నాలుగో స్థానంలో ఉండగా. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన  లెక్కల్లో రెండో స్థానానికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి  10 లక్షల మందిలో 715 మందికి కరోనా పరీక్షలు చేస్తూ కరోనా వైద్యపరీక్షల్లో ఏపీ దేశంలోని రెండో స్థానానికి చేరుకుంది. ప్రతి పది లక్షల మందిలో 830 మందికి పరీక్షలు చేస్తూ రాజస్థాన్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో భారతదేశం సగటు 10 లక్షల మందికి 290 మాత్రమే ఉండటం గమనార్హం.

 

అత్యధిక కేసులతో ఉన్న ఇతర రాష్ట్రాలలో కంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పరీక్షలు నిర్వహించటం విశేషం. ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైన గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర ల కంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక్క రోజులోనే 615    పరీక్ష ల సామర్ధ్యం నుంచి 715 పరీక్షల సామర్ధ్యానికి పెరుగుదల నమోదయింది. గడచిన 24 గంటల్లో 5022 మందికి పరీక్షలు జరిపారు. ఏపీలోని అన్ని జిల్లాలకు టెస్టింగ్ కిట్లను సరఫరా చేయడం పూర్తయింది కావున ఇంకా  పరీక్షల సామర్థ్యం పెరగనుంది. ఇక మండలాల్లో కూడా ర్యాన్ డమ్  గా పరీక్షలు చేసే వెసులుబాటును మరియు  ప్రణాళికను ప్రభుత్వం   రూపొందించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: