కరోనా మహమ్మారి కారణంగా  ప్రపంచ దేశాలు తల పట్టుకుని కూర్చున్నాయి. ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా సైతం దీని దెబ్బకు అబ్బా అంటోంది. నిన్న మొన్నటి వరకు చెలరేగిపోయిన ట్రంప్ .. కరోనా వైరస్ చైనాలోని  వుహాన్ సైన్స్ ల్యాబ్ లో నుంచి పుట్టిందే  కావున ప్రపంచంలో జరుగుతున్న ఈ విపత్తు చైనా నే జవాబుదారీగా ఉండాలని సూచించింది.

 

అందుకు చైనా కూడా గట్టి సమాధానమే ఇచ్చింది.  అయితే ఈ దేశాల మధ్య పెరుగుతున్న వివాదానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెరదించింది. అదేంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవాళ రిలీజ్ చేసిన ప్రకటనలో కరోనా వైరస్ అసలు ల్యాబ్ నుంచి పుట్టినది కాదు అని తేల్చి చెప్పింది. అదేవిధంగా జంతువుల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకింది అని  స్పష్టం చేసింది. అయితే ఈ వైరస్ ల్యాబ్ నుంచి పుట్టింది అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి గబ్బిలాల నుంచి గాని పాముల నుంచి గాని వచ్చి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేసింది. అయినప్పటికీ గబ్బిలాల నుంచి కరోనా వైరస్ పుట్టిందా? లేదా పాముల నుంచి పుట్టిందా? అనే విషయం తేల్చాల్సి ఉంది అని తెలియజేసింది... డబ్ల్యుహెచ్వో

మరింత సమాచారం తెలుసుకోండి: