బిగ్‌బాస్‌-14 ఆడిష‌న్స్ మే నుంచి ప్రారంభించేందుకు నిర్వాహ‌కులు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. బిగ్‌బాస్‌-13 సీజన్ సూప‌ర్‌హిట్ అయిన ఉత్సాహంలో ఉన్న నిర్వాహ‌కులు సీజ‌న్ 14కు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు మేలో ఆడిష‌న్స్ నిర్వ‌హించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. వివాదాస్పదమైన‌ రియాలిటీ టీవీ షో ఈ సారి కూడా ప్ర‌ముఖుల‌తోపాటు ప‌లువురు సామాన్యులను హౌస్‌లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక‌ ఈ సీజన్‌ సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుందట‌. 

 

అయితే.. బిగ్‌బాస్‌-14 థీమ్ విష‌యంలో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం బిగ్ బాస్ హౌస్‌ను 'కాలేజ్ లైఫ్' థీమ్ లేదా.. 'జంగిల్ థీమ్‌తో రూపొందించాల‌ని నిర్వాహ‌కులు చూస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతానికి ఈ సీజ‌న్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేన‌ట‌ప్ప‌టికీ అనేక ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. బిగ్‌బాస్‌-14కు హోస్ట్‌గా కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ కొన‌సాగుతాడా..?  లేదా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి.. గ‌తంలో స‌ల్మాన్‌ఖాన్ ప‌లుమార్లు ఈ విష‌యంపై స్పందించారు. మ‌ళ్లీ హోస్ట్‌గా రావ‌డం క‌ష్ట‌మేన‌ని పేర్కొన్నాడు. ఇందుకు బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయ‌ట‌. సినిమాలు, ఆరోగ్యం త‌దిత‌ర కార‌ణాల దృష్ట్యా స‌ల్మాన్ రావ‌డం క‌ష్ట‌మేన‌నే టాక్ వినిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: