ఓవైపు ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతుంటే జమ్మూకశ్మీర్ లోని పోషియాన్ జిల్లాలో మాత్రం భారత సైనిక బలగాలకు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పాక్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. జమ్మూకశ్మీర్ పోలీసులకు నిన్న రాత్రి సమయంలో పోషియాన్ జిల్లా జాన్ పొరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందింది. 
 
నిన్న అర్ధరాత్రి పోలీసులు జవాన్లతో కలిసి ఉగ్రవాదుల కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపగా జవాన్లు వారిపై ఎదురుకాల్పులు జరిపారు. అధికారులు ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఈరోజు ఉదయం ప్రకటించారు. నలుగురు ఉగ్రవాదులలో ఇద్దరు మాత్రమే దొరికారని మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. 
 
గడచిన 30 రోజుల్లో ఆరు మంది ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ తో కశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రదాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అలెర్ట్ అయిన భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: