సూర్యాపేట జిల్లాలో కరోనా మహమ్మరి రోజు రోజుకి  విజృంభిస్తోంది. సోమావారం రోజున 24 కేసులు నమోదు కాగా అప్పటివరకూ కేసులు తో కలిపి 54 కేసులుగా నమోదయ్యాయి ఇందులో 36 కేసులు కేవలం సూర్యాపేట టౌన్ నుంచి నమోదు కావడం అధికారులని విస్మయానికి గురిచేసింది. దీనితో సీఎం కేసీఆర్ ఇప్పటికే క్షేత్రస్థాయి సమీక్ష జరిపారు. అయితే ఈ సందర్భంగా పురపాలక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నా వేణుగోపాల్ రెడ్డి ని ప్రత్యేక అధికారిగా పంపిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ గడచిన 24 గంటల్లో మరో 26 పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం  హుటాహుటిన అక్కడ కు చేరుకుంది.

 

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ మరియు తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి లు సూర్యాపేట కు చేరుకున్నారు. నమోదవుతున్న  ఏరియాల గురించి పూర్తిస్థాయిలో సమీక్ష జరుపుతున్నారు. సూర్యాపేట్ కూరగాయల మార్కెట్ లోని ఓ వ్యక్తి వ్యక్తి ద్వారా కరోనా సోకినట్లు అధికారులు ఇప్పటికే నిర్ధారించారు ఆ వ్యక్తి ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ జమాత్  ప్రార్థనల కోసం వెళ్లి వచ్చాడు. అతను వెళ్లి వచ్చిన కాడ నుంచి ఆ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిసర ప్రాంతాలను మరియు సూర్యాపేట చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను అధికారులు కట్టుదిట్టం చేశారు. నిన్న నమోదైన 26 కేసులు తో కలిపి మొత్తం 80 కేసులుగా అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: