తెలంగాణ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో విఫ‌లం చెందిన ఉన్న‌తాధికారుల‌పై వేటువేశారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. నిన్న ఒక్క‌రోజే ఏకంగా 26 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో క‌రోనా కేసుల సంఖ్య 80కి చేరుకుంది. దీనిపై సీరియ‌స్ అయిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెంట‌నే సీఎస్ సోమేశ్‌కుమార్‌తోపాటు డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి, వైద్యారోగ్య కార్య‌ద‌ర్శిని సూర్యాపేట జిల్లాలో ప‌ర్య‌టించాల‌ని ఆదేశించారు. ఈ మేరకు వారు ఈ రోజు ఉద‌య‌మే సూర్యాపేట‌లో ప‌ర్య‌టించారు. ప‌రిస్థితిని క్షేత్ర‌స్త‌సాయిలో ప‌రిశీలించారు. క‌రోనా క‌ట్ట‌డిలో విఫ‌లం చెందిన‌ జిల్లా వైద్యాధికారి, డీఎస్పీపై వేటు వేశారు. వారి స్థానంలో ఇత‌ర అధికారుల‌ను నియ‌మించారు.

 

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో క‌రోనాను క‌ట్ట‌డి చేసిన సాంబ‌శివ‌రావును సూర్యాపేట‌ జిల్లా వైద్యాధికారిగా నియ‌మించారు. ఇక స్పెష‌లాఫీర్‌గా స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. సూర్యాపేట మున్సిపాలిటీ స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా వేణుగోపాల్‌రెడ్డిని నియ‌మించారు. ఇక నుంచి సూర్యాపేట‌లో స్పెష‌ల్ యాక్ష‌న్ ప్లాన్ అమ‌లుచేసేందుకు కార్యాచ‌ర‌ణ చేప‌డుతున్నారు. తెలంగాణ‌లో మొద‌టిసారిగా చ‌ర్య‌లు తీసుక‌వ‌డంతో అధికారులు ఉలిక్కిప‌డుతున్నారు. ముందుముందు మ‌రిన్ని చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌నే హెచ్చ‌రిక‌ల‌ను సీఎం కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: