ఎక్కడో చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన దిక్కుమాలిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో ప్రబలిపోతుంది.  ప్రతిరోజూ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతూ మనిషికి కంటిమీద కునుకు లేకుండా పోతుంది. భారత్‌లో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య రోజురోజు పెరిగిపోతున్నాయి. దేశంలో 24 గంటలో కొత్తగా 1,383 కేసుల నమోదయ్యాయి. దీంతో సుమారు 50 మంది మరణించారు. కాగా దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 19,984కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 640 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.  ఇప్పటి వరకు కరోనా నుంచి 3,869 మంది కోలుకున్నారని చెప్పింది. 

 

గుజరాత్‌లో ఒక్కసారిగా విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. తమిళనాడు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 1,500పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 5,218కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 251 మంది మృతి చెందారు. గుజరాత్‌లో 2,178 మందికి కరోనా సోకగా, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,156కి చేరింది.కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కేసులు 20,000కు చేరువలో ఉన్నాయి. 

 

దేశంలో కరోనా విస్తరించడానికి కారణం మొన్నటి వరకు విదేశీయులు అయితే.. ఇటీవల మర్కజ్ ప్రార్థనలు వెళ్లి వచ్చిన వారికే ఎక్కువగా వచ్చాయని అంటున్నారు.  ఏది ఏమైనా ఈ కరోనా కట్టడి అయ్యే వరకు మనషుకు మనశ్శాంతి లేదు.. లాక్ డౌన్ పూర్తయ్యేలా లేదని సామాన్య పౌరులు ఆవేదన చెందుతున్నారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: