ఏపీలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి గంట గంట‌కు చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా బుధ‌వారం 56 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. వీటితో క‌లుపుకుంటే ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం కేసుల సంఖ్య 813కు చేరుకుంది. ఇక ప్ర‌స్తుతం 669 మంది ఏపీలో కోవిడ్ చికిత్స పొందుతున్నారు. 120 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 24 మంది మృతి చెందారు. ఇక జిల్లాల వారీగా చూస్తే కేసులు ఇలా ఉన్నాయి. 

 

జిల్లాల వారీగా చూస్తే క‌ర్నూలులో 200 కేసులు దాటాయి. ఇప్ప‌టికే అక్క‌డ 203 కేసులు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో గుంటూరు జిల్లా ఉంది. గుంటూరులో 177 కేసులు ఉన్నాయి. ఇక కేసులు లేని జిల్లాలుగా శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం ఉన్నాయి. 

 

ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు:
కర్నూలు-203.
గుంటూరు-177.
కృష్ణా-86.
నెల్లూరు-67.
చిత్తూరు-59.
వైఎస్సార్‌ కడప-51.
ప్రకాశం-48.
పశ్చిమ గోదావరి-39.
అనంతపురం-36.
తూర్పు గోదావరి-26.
విశాఖపట్నం-21.
విజయనగరం-0.
శ్రీకాకుళం-0.
మొత్తం: 813.

 

ఏపీలో జిల్లాల వారీగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయిన వారు:
గుంటూరు-8.
అనంతపూర్-5.
కడప-4.
నెల్లూరు-4.
కృష్ణ-2.
విశాఖపట్నం-1.
మొత్తంగా: 24.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: