ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విధ్వంసం సృష్టిస్తోంది. రోజూ ఈ వైర‌స్‌బారినిప‌డి వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ల‌క్ష‌ల సంఖ్య‌లో బాధితులు ఉన్నారు. ఇక దీని బారిన ఏకంగా దేశాధినేత‌లు కూడా ప‌డుతున్నారు. ప‌లువురు ప్ర‌ముఖులు ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్ యువ‌రాణి క‌రోనాకు బ‌లైన విష‌యం తెలిసిందే. మొన్న‌టికి మొన్న యూకే ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ కూడా క‌రోనా బారిన‌ప‌డ్డారు. మొద‌ట సెల్ఫ్ఐసోలేష‌న్‌లో ఉన్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆస్ప‌త్రిలో చేరారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉందంటూ వార్త‌లు కూడా వ‌చ్చాయి.

 

ఐసీయూలో చికిత్స పొందిన త‌ర్వాత ఆయ‌న క్షేమంగా బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా.. పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పాక్‌లో రోజురోజుకూ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు పాజిటివ్‌కేసుల సంఖ్య 9,749కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 2,156కు చేరుకుంది. క‌రోనాతో మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 209కి చేరుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: