ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాలు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు క‌రోనా మ‌ర‌ణాల నేప‌థ్యంలో చ‌నిపోయిన వారిని ఖ‌న‌నం చేసేందుకు కూడా చాలా చోట్ల ఒప్పుకోవ‌డం లేదు. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సోకి మ‌ర‌ణించిన వారి ని ఖ‌న‌నం చేసే విష‌యంలో అనేక ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. కొన్ని చోట్ల ఈ డెడ్ బాడీల‌ను ఖ‌న‌నం చేస్తున్నారు. కొన్ని చోట్ల మూకుమ్మ‌డిగా మృత‌దేహాల‌ను సామూహికంగా ఖ‌న‌నం చేస్తోన్న ప‌రిస్థితి. 

 

కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారిని ఖననం చేసేందుకు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఓపెన్ శ్మ‌శానాల్లో ఈ మృత‌దేహాల‌ను ఖ‌న‌నం చేసేందుకు ఒప్పుకోవ‌డం లేదు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో ఇలాంటి ఇబ్బందులే ఎక్కువుగా ఉన్నాయి. చెన్నైలో ఓ వైద్యుడు కరోనాతో మృతి చెందగా.. ఆయన మృతదేహాన్ని ఖననం చేయడానికి స్థానికులు వ్యతిరేకించారు. దీంతో సీనియ‌ర్ హీరో, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ స్పందించారు. 

 

చెన్నై శివార్లలో విజయ్‌కు చెందిన ఆండాళ్ అళగర్‌ కాలేజీ ఉండగా.. దాని ప్రాంగణంలో ఉన్న కొంత భాగాన్ని కరోనా మృతుల ఖననానికి ఇస్తానని ఆయన ఓ ప్రకటన ఇచ్చారు. దీనిపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. విజ‌య్ కాంత్ మంచి మ‌న‌స్సుతో త‌న స్థ‌లం ఇవ్వ‌డం నిజంగా అభినందించదగ్గ విషయం. ఆయన వ్యక్తిత్వం గొప్పది అని సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: