జ‌యో హో మోదీజీ అంటూ దేశ‌వ్యాప్తంగా ఉన్న వైద్య‌లు అంద‌రూ మోదీని కీర్తిస్తూ హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లే ఓ వైపు ప్ర‌పంచాన్ని ఇటు మ‌న‌దేశాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి క‌మ్మేసింది. ఈ మ‌హమ్మారి దెబ్బ‌తో ప్ర‌జ‌లు అంద‌రూ ఎప్పుటి వ‌ర‌కు ఉంటారో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి. చివ‌ర‌కు ప్రాణాల‌కు తెగించి వైద్యం చేస్తోన్న డాక్ట‌ర్ల‌పై దేశ వ్యాప్తంగా దాడులు జ‌రుగుతున్నాయి. మ‌రో వైపు క‌రోనా సోకిన బాధితుల‌కు వైద్యం చేస్తోన్న డాక్ట‌ర్లు సైతం క‌రోనా సోకి చ‌నిపోతున్నారు.

 

ఇక డాక్ట‌ర్ల‌కు ర‌క్ష‌ణ‌గా ఇప్పుడు మోదీ ఆధ్వ‌ర్యంలో కేంద్ర కేబినెట్ స‌మావేశ‌మైన డాక్ట‌ర్ల‌కు ర‌క్ష‌ణ కోసం ఆర్డినెన్స్ తీసుకు రావ‌డంతో ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఉన్న వైద్యులంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.ఇక ఈ కేబినెట్ భేటీలో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంచాల‌ని అనుకున్నా ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో ఇది వాయిదా ప‌డింది.. దీనికి కేబినెట్ ఇంకా ఆమోదం తెల‌ప‌లేదు. ఇక వైద్యుల‌పై దాడి చేసే రోగులు, రోగుల బంధువులు.. ఇత‌రుల‌పై క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకోనున్నారు.

 

గాయ‌ప‌రిచిన తీవ్ర‌త‌ను బ‌ట్టి ఆరు నెల‌ల నుంచి ఏడేళ్ల ‌వ‌ర‌కు జైలు శిక్ష విధిస్తారు. రు. 50 వేల నుంచి రు. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు జరిమానా విధిస్తారు. అలాగే దాడి చేసిన వెంట‌నే నాన్‌బెయిల్ బుల్ కేసులు కూడా న‌మోదు చేస్తారు. ఇక ఈ కేసును 30 రోజుల్లో విచార‌ణ పూర్తి చేయాలి. అలాగే డాక్ట‌ర్ల‌కు సంబంధించిన ఆస్తి న‌ష్ట‌ప‌రిస్తే అందుకు డ‌బుల్ మొత్తం వారి నుంచే వ‌సూలు చేయాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: