కరోనా కేసులు విశాఖ పట్నం లో ప్రబలుతున్న కారణంగా కొన్ని స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చాయి.  విశాఖపట్నం జిల్లా లోని పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ లో రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది .  కూరగాయలు కొనే సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే   ఈ సందర్భంగా  ప్రగతి భారత్ ఫౌండేషన్  తన వంతు సాయం చేయడానికి వచ్చింది.

 

విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లోని రైతు బజారు వద్ద కరోనా నియంత్రణలో భాగంగా  ప్రజల రక్షణ కోసం ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శానిటైసర్ స్ప్రే ఛాంబర్ ను ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఉంటున్న మస్త్యకారుల 700 కుటుంబాలకు నిత్యావసరాలను మరియు శానిటైసాలను అందజేసింది . అదేవిధంగా విశాఖపట్నంలో ఈరోజు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని 12 వేల మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు, శానిటైజర్ల పంపిణీ చేసారు వైసీపీ ఎమ్మెల్యే  విజయసాయి రెడ్డి గారు...

మరింత సమాచారం తెలుసుకోండి: